SRCL: చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమిపూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా పంచాయతీ భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ


