హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మవారి నగలు చోరీ'

NZB: సిరికొండ మండలం పాకాల గ్రామంలోని శ్రీ సేవాలాల్ జగదాంబ దేవాలయంలో అమ్మవారి నగలు (పుస్తెలు) చోరీకి గురయ్యాయి. పూజకు వెళ్లిన పూజారి బాదావత్ సేవలాల్ వివరాల ప్రకారం, అర్ధరాత్రి సమయంలో నగలు చోరీ అయినట్లు తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్తులు సిరికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.