హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న MLA

BDK: ఆసియా ఖండంలో ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలను మంత్రి సీతక్కతో ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి కుటుంబ సభ్యులతో అమ్మవార్లను ఇవాళ దర్శించుకున్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.