MHBD: జిల్లాలోని 18 మండలాల్లో సోమవారం(రేపు) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు MPDO కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు MHBD కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కార్యక్రమానికి 23 మంది మండల స్థాయి అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో తెలియజేసి పరిష్కారం పొందాలని కోరారు.
తెలంగాణ
రేపు ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్


