హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలు విజయవంతం చేయాలి'

NRML: పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుంచి 25 వరకు గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని TGS JAC రాష్ట్ర ఛైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 18లోపు జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.