హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాజ్‌పేయికి బీజేపీ నేతల నివాళులు

RR: రాష్ట్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఘన నివాళులర్పించారు. వాజ్‌పేయి పాలనలో జాతీయ రహదారులు, టెలికాం, గ్యాస్ కనెక్షన్ల రంగాల్లో కీలక సంస్కరణలు జరిగాయని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిచ్చిన వాజ్‌పేయి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.