హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డి ప్రజలను అవమానించారు: ఎమ్మెల్యే

HYD: తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి పర్యటనకు సంబంధించి తనకు కనీస సమాచారం ఇవ్వలేదని, తనతో పాటు సంగారెడ్డి ప్రజలను సీఎం అవమానించారని ఆరోపించారు. సీఎం సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా జరిగిందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకని ప్రశ్నించారు.