హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే

GDWL: మల్దకల్ మండలం మేకలసోంపల్లిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కల నెరవేరుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులందరికీ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.