హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా ఆధ్యాత్మిక శోభ

NRPT: నర్వ మండలం లక్కర్ దొడ్డి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ధ్వజస్తంభం, నాభిశిల, బొడ్రాయి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండో రోజు ఆలయంలో హోమాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రేపు ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.