ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన శబరిమాత ఆఖండ జ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి'


