హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైదాపూర్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి'

KNR: ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు సైదాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమానికి 26 శాఖల అధికారులు హాజరుకావాలని ఎంపీడీవో భూక్యా యాదగిరి ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదు ఇవ్వాలని సూచించారు.