హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకాశీ చిత్రకళకు గవర్నర్ ప్రశంసలు

SDPT: తెలంగాణ ప్రసిద్ధ చేర్యాల నకాశీ కళను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసించారు. లోక్‌భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ ‘ఎట్ హోమ్’ వేడుకల్లో ఏర్పాటు చేసిన నకాశీ మాస్క్‌లను సతీమణి జానకి శుక్లాతో కలిసి ఆయన వీక్షించారు. కళాకారుడు దనాలకోట రాకేశ్‌ను అభినందించారు. రాకేశ్ నకాశీ కళా విశేషాలను వారికి వివరించారు. దర్బార్ హాల్లో సంస్కృతి చిత్రాలను ప్రదర్శించారు.