హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ సర్పంచ్ మృతికి మైనంపల్లి సంతాపం

MDK: నిజాంపేట మండలం చల్మెడ గ్రామ మాజీ సర్పంచ్ చప్పెట నరసింహారెడ్డి హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో కన్నుమూసిన ఆయన పార్థివదేహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నరసింహారెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.