BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచిన అనంతరం సుప్రభాత సేవ, ఆరాధనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మిథిలా స్టేడియంలో అర్చకులు స్వామివారి కల్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
వైభవంగా రాములువారి నిత్య కళ్యాణం..


