హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిన్నెరసానిలో పర్యాటకులు సందడి

KMM: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పాల్వంచ మండలం కిన్నెరసానిలో పర్యాటకుల సందడి కనిపించింది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. 641 మంది పర్యాటకులు కిన్నెరసానికి ప్రవేశించగా రూ.30,870 ఆదాయం,సఫారీ వాహనాల ద్వారా రూ.10,400 లభించినట్లు వైల్డ్ లైఫ్ సిబ్బంది తెలిపారు. 440 మంది బోటింగ్ చేయగా రూ.22,310 ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.