హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బండపాలెంలో పోలీసుల కార్డాన్ సెర్చ్..!

బాపట్ల జిల్లా ఎస్పీ, చీరాల డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బండపాలెంలో అదివారం విస్తృత కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచామని తెలిపిన అధికారులు, సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఆదివారం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.