హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ఎకో పార్కులో మొక్కలు నాటిన డీఆర్‌ఎం

GNTR: గుంటూరు రైల్వే ఎకో పార్కులో ఆదివారం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 1,500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని డీఆర్‌ఎం సుదేష్ణ సేన్ ప్రారంభించారు. ‘సేవ్ గ్రీన్.. సేవ్ ఎర్త్’ నినాదంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు.