హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 18న ఆర్జిత సేవ టికెట్ల విడుదల

TPT: నవంబరులో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల డిప్‌ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బు చెల్లించి లక్కీడిప్‌ టికెట్లు పొందాల్సి ఉంటుంది.