హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా స్కెచ్‌

అన్నమయ్య: టి.సుండుపల్లిలో రోడ్డు ప్రమాదంగా భావించిన ఘటన జంట హత్యగా తేలింది. ఇంటి స్థలం వివాదంతో జయరాం, రవీంద్రలను పక్కా స్కెచ్ ప్రకారం వాహనంతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శివప్రసాద్, చరణ్‌లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శివశంకర్‌తో పాటు మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.