హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరికి గురవుతున్న ఫుట్ పాత్ డస్ట్ బిన్లు

శ్రీకాకుళం: నగరంలో ఫుట్ పాత్‌లపై ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన తడి-పొడి డస్ట్ బిన్లు చోరికి గురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇవి విరిగిపోయి అలంకారప్రాయంగా మిగిలాయి. చెత్త నుంచి సంపద నినాదంపై జనంలో జాగృతి కొరవడడం, తడి-పొడి చెత్త విషయంలో సరైన ప్రచారం లేకపోవడం.. ఈ పరిస్థితికి హేతువులు. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం వీటి విషయంలో ప్రజలకి చైతన్యం కల్పించాలి.