హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీచర్ పోస్టులకు ఆహ్వానం

ప్రకాశం: అకడమిక్ ఇన్స్‌ట్రక్టర్ల పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ఇందిరా ప్రసాద్ తెలిపారు. పుల్లలచెరువు మండలంలోని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 58, స్కూల్ అసిస్టెంట్ 12 పోస్టులు మంజూరైనట్లు ఆమె వివరించారు. అర్హులైన వారు నేటి నుంచి ఈ నెల 21లోగా దరఖాస్తులను ఎంఈవో కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు. టెట్ అర్హత ఉండాలన్నారు.