W.G: ఆకివీడు శివారు ఉప్పుటేరు ప్రాంతంలో శనివారం వెలుగుచూసిన మహిళ మృతి కేసు పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణా- ప.గో. జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మహిళను హత్య చేసి, దుప్పట్లో చుట్టి పడవేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు సంబంధించిన ఫొటోలను పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఆమె ఎవరనేది గుర్తిస్తే కేసులో ఆధారాలు లభించే అవకాశముందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ మృతి కేసులో మిస్టరీ..!


