హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

UPDATE: కాపాడబోయి.. కన్నీళ్లు మిగిల్చారు!

GNTR: తాడేపల్లి పరిధిలో నిన్న ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. పద్మావతి ఘాట్ సమీపంలో కృష్ణా నదిలోకి దిగిన తేజేశ్, గౌతమ్, జాషువా లోతుకు వెళ్లి నీటమునిగారు. ఒకరు మునిగిపోతుండగా కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో విజయవాడ కృష్ణలంకలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.