హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయం పాలకవర్గ మండలి పదవి ప్రమాణ స్వీకారం

NTR: జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ దేవాలయం పాలకవర్గ మండలి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయం ఛైర్మన్‌గా చుంచు రమేశ్‌బాబు, 13 మంది సభ్యులతో ఈవో లీలాకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.