TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20-24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, ఆక్టోపస్ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 90,293 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 53,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం: నేటి తిరుమల సమాచారం


