హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైప్లైన్ చితికి పోవడంతో వృధాగా పోతున్న త్రాగునీరు

AKP: మండలంలోని చోద్యం నుంచి సరఫరా అవుతున్న తాగునీటి పైప్‌లైన్‌ చిన్నయ్యపాలెం రైస్‌మిల్‌ సమీపంలో చితికిపోవడంతో భారీగా నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో తాగునీరు వృథాగా పోవడంతో పాటు రహదారిపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మరమత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.