హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

శ్రీకాకుళం నగరం బలగలోని ఓ కల్యాణ మండపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.80,400 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఈశ్వరరావు తెలిపారు.