హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంతెన లేక గిరిజనుల అవస్థలు

ASR: తాజంగి పంచాయతీ పరిధిలోని వనజాజుల, బూడిదపాడు, బోయపాడు గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. గ్రామాల మధ్య ప్రవహించే పెద్దవాగును దాటేందుకు గిరిజనులు కర్రలు, చెక్కలతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. వర్షాకాలంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించే వేళ ఈ వంతెనపై రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రభుత్వం స్పందించి శాశ్వత వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.