హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురుగు మందు తాగి వ్యక్తి మృతి

KKD: పెద్దాపురంలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన తాపీ కార్మికుడు చెక్క రత్నరాజు (45) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అస్వస్థతకు గురైన అతడిని కుటుంబ సభ్యులు పెద్దాపురం, అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య జగదీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాపారావు తెలిపారు.