ELR: జంగారెడ్డిగూడెం- అశ్వారావుపేట రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శనివారం ఎస్సై వీరప్రసాద్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.44,220 నగదుతో పాటు పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై దాడి..!


