హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో దారుణ హత్య

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గరికపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద బ్రహ్మం అనే వ్యక్తి తెలంగాణకు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. శనివారం రాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆమెను పెద బ్రహ్మం గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.