హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

210 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత

PPM: జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయతీ నీలకంఠాపురం వద్ద శనివారం అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. DSO, అలమండ VRO సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో వ్యాన్‌లో తరలిస్తున్న 210 బస్తాలు (10,040 కిలోల) PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు మండంగి రవిపై 6 A కేసు నమోదు చేసినట్లు DT శివయ్య తెలిపారు.