హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు

VZM: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈనెల 17 నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. రోజుకు సుమారు 30 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, తిరుపతితో పాటు సింగపూర్‌, అబుదాబీకి సేవలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేశారు.