హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: నెల్లూరు నగరంలోని 33/11 కెవి ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపట్టనున్నారు. దీంతో ఆదివారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆటోనగర్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. స్థానికులు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.