హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సుభాష్ సమక్షంలో TDPలోకి భారీ చేరికలు

కాజులూరు మండలం అండ్రంగిలో శనివారం రాత్రి వైసీపీ కి చెందిన 150 మంది కార్యకర్తలు మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో TDPలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. CM చంద్రబాబు నాయకత్వం, మంత్రి పనితీరు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల TDP అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి, గ్రామ అధ్యక్షుడు రాజుబాబు పాల్గొన్నారు.