హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన

W.G: ఆర్చరీ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన తణుకు విద్యార్థులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. నిట్టా హంసిని (ఇంటర్), చుండూరి హర్షద్ (6వ తరగతి) ఆర్చరీలో ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడంతో వీరిని ఎమ్మెల్యే అభినందించారు.