హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గామన్ బ్రిడ్జి వద్ద పీడీఎస్ బియ్యం సీజ్'

E.G : రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు సమీపంలోని గామన్ బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి అధికారులు భారీగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 16,050 కిలోల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీల్లో గుర్తించి సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.