హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ తయారీ.. ముగ్గురిపై కేసు

W.G: తణుకు మండలం దువ్వలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. వయ్యేరు కాలువ పక్కన తోటల్లో వేగిరోతు రామశివాజీ (శివ), గండికోట రాజు, పోతిరెడ్డి సత్యనారాయణ ఎలాంటి అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని బాణసంచా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.