హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంటల బీమా చెల్లింపుల గడువు పెంపు'

VZM: ఈ నెల 31 వరకు పంటల బీమా ప్రీమియం చెల్లింపుల గడువును ప్రభుత్వం పొడిగించిందని చీపురుపల్లి MAO సూర్యకుమారి శనివారం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులను ఆదుకునేందుకు నిన్నటితో ముగిసిన గడువును పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటివరకు బీమా చెల్లించని రైతులు గడువులోగా ప్రీమియం చెల్లించి ప్రయోజనం పొందాలని ఆమె సూచించారు.