హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తోటపల్లి ప్రాజెక్టు వలన భూగర్భ జలాలు పెరిగాయి '

VZM: తోటపల్లి ప్రాజెక్టుతో నియోజకవర్గ పరిధిలో భూగర్భ జలాలు పెరిగాయని చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకట్రావు శనివారం తెలిపారు. దీనివలన రైతులకు మరింత మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం 230 kv ఒకటి, 33 kv లతో రెండు స్టేషన్‌లు CM మంజూరు చేశారని తెలిపారు. జిల్లాలో 35 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా వాటిలో 14,000 తమ నియోజకవర్గంలో ఉన్నాయన్నారు.