హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ డిజిటల్ అసిస్టెంట్‌గా సోమశేఖర్ రెడ్డికి అవార్డు

అన్నమయ్య: తంబళ్లపల్లె-1 స్వర్ణ గ్రామం డిజిటల్ అసిస్టెంట్ సోమశేఖర్ రెడ్డిని అన్నమయ్య జిల్లాలో ఉత్తమ SGSW డిజిటల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడలో SGSW డైరెక్టర్ శివప్రసాద్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం, మెమెంటో అందుకున్నారు. జిల్లాలో అత్యధికంగా స్వర్ణ గ్రామ సర్వీసులు అందించినందుకు ఈ అవార్డు దక్కింది.