హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నంద్యాలలో PGRS కార్యక్రమం

NDL: రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాలలో ఉన్న తహసిల్దార్ కార్యాలయాలలో కూడా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెలుపవచ్చునని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.