కృష్ణా: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న శేరీనరసన్నపాలెంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు మత్తి సాంబశివరావు తెలిపారు. కామినేని, తేలప్రోలు శంకర కంటి ఆసుపత్రి సహకారంతో జరిగే ఈ శిబిరంలో కంటి, గుండె సంబంధిత పరీక్షలు, రుమటాలజీ, చిన్నపిల్లల వైద్య సేవలు అందిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత మెగా వైద్య శిబిరం


