KDP: పులివెందుల- కదిరి రింగ్‌రోడ్డు సమీపంలో 5 లీటర్ల నాటుసారాతో లింగాల మండలం బాలసముద్రానికి చెందిన నవీన్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో సీఐ శ్రీరామ్ సిబ్బందితో నిఘా ఉంచగా, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాటుసారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ : CI


