హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: పొన్నూరు మండల పరిధిలోని 11 కేవీ విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్టా ఆదివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ ఉప కార్య నిర్వాహక అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కట్టెంపూడి అడ్డరోడ్డు, మునిపల్లె, పచ్చలతాడిపర్రు, గోళ్లమూడిపాడు, దండమూడి, అరమండ, బ్రాహ్మణకోడూరు తదితర ప్రాంతాల్లో విద్యుత్తు ఉండదన్నారు.