హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

NTR: మైలవరం మండలం కొత్తగూడెం పరిధిలోని ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 86,180 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.