హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా శీలం ఉమా

VSP: బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా శీలం ఉమా వెంకట రాఘవ కుమారిని నియమించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్.పరశురామరాజు ఆమెకు నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉమా పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.