హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో యువకుడి ఆత్మహత్య

అన్నమయ్య: రాజంపేట పట్టణం బండ్రాళ్ల వీధిలో రాఘవ (21) అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పైఅంతస్తులోని గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఎస్సై వెంకటేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియరాలేదు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.