హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

కృష్ణా: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుడివాడ బస్టాండ్‌ సమీపంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన మతి రాజేశ్‌ను ఎక్సైజ్‌ సీఐ వెంకటరమణ అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.