హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంక గ్రామాలకు తప్పని కష్టాలు

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న పాములలంక, కనిగిరి లంక, తొడెళ్ల దిబ్బ తదితర గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల సమయంలో రాకపోకలు నిలిచిపోవడంతో పడవలపైనే ఆధారపడాల్సి వస్తోందని, అత్యవసర వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణం విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.